నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్

  • వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ
  • రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి
  • కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం
ఎండలతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని... వర్షాలు కురిసేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించింది. రుతుపవనాలు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనాలు, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. 

ఉత్తర కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

AP Weather
Andhra Pradesh
Weather Update
Rain Alert
Monsoon
Rayalaseema
North Coastal Andhra
IMD
Heavy Rains

More Telugu News